ఇకనుండి వినియోగదారుల మంత్రిత్వ శాఖలో కూడా చాట్‌జీపీటీ సేవలు!
TeluguStop.com
యావత్ టెక్ ప్రపంచంలో ఇప్పుడు చాట్‌జీపీటీ ( ChatGPT ) అనేది హాట్ టాపిక్.
చరిత్రలో ఇప్పటివరకు ఏ ఏఐ చాట్‌బాట్ చేయలేని పనులను చాట్‌జీపీటీ క్షణాల్లో విజయవంతంగా చేయడంతో దానిపేరు బాగానే వినబడుతోంది.
అపారమైన నాలెడ్జితో ఏ విషయాన్నైనా పరిష్కరించే ఈ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు సామాన్యులతో పాటు ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నాయి.
తాజాగా భారత వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ( Ministry Of Consumer Affairs ) సైతం చాట్‌జీపీటీ సామర్థ్యాలను వినియోగించుకునేందుకు రంగంలో దిగింది.
"""/" /
ఈ మంత్రిత్వ శాఖ నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్లో వినియోగదారులు చాలా సులభంగా ఫిర్యాదులు చేయడానికి చాట్‌జీపీటీ-ఆధారిత వ్యవస్థను తీసుకొచ్చే పనిలో పడింది.
ఈ విషయాన్ని తాజాగా ఓ సీనియర్ అధికారి ఓ మీడియా వేదికగా పేర్కొన్నారు.
చాట్‌జీపీటీ టెక్నాలజీతో నడిచే ఆ సిస్టమ్‌ను ఉపయోగించి వ్యక్తులు తమ ఫిర్యాదులను వాయిస్ నోట్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఈజీగా నివేదించగలరని అధికారి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రిత్వ శాఖ ఓపెన్ ఏఐ సంస్థ( Open AI ) ఎగ్జిక్యూటివ్‌లతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
"""/" /
ఇక వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓపెన్ ఏఐ మధ్య భాగస్వామ్యం కుదిరితే, వినియోగదారులు తమ ఫిర్యాదులను టెక్స్ట్ మెసేజ్‌లు లేదా వాయిస్ నోట్‌లను ఉపయోగించి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కి తేలికగా సబ్మిట్ చేయవచ్చు.
మరోవైపు భారత ప్రభుత్వం తన సొంత చాట్‌జీపీటీ వెర్షన్‌ను రూపొందించాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
భారత చాట్‌జీపీటీకి సమానమైన అంశం గురించి కొన్ని వారాల్లో ప్రకటన చేయనున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
తల్లిని తలచుకుని బిగ్ బాస్ వేదికపై ఎమోషనల్ అయిన సుదీప్.. అలా కామెంట్స్ చేస్తూ?