చాట్ జిపిటి వర్సెస్ క్యారెక్టర్ ఏఐ… ఏ క్యారెక్టర్‌తోనైనా చాట్ చేయొచ్చునట!
TeluguStop.com
మనిషి ఊహాశక్తి అద్భుతం.ఈ క్రమంలో మనిషి ఎన్నో అద్భుతాలు చేసాడు.
అవును, కాల్పనికత అనేది మనకు కొత్త కాదు.అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకు వెళ్లిందని ఇంటర్నెట్ ప్రపంచం అంటోంది.
నేటి యువత తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ 'క్యారెక్టర్.ఏఐ'( Character.
AI ) ఆ సాంకేతికతలో భాగమే.ఏఐ పవర్ హౌజ్ 'ఓపెన్ ఏఐ'( Open AI ) అంతర్జాల సంచలనంగా మారిందిపుడు.
'చాట్ జీపీటీ' పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్‌బాట్‌లను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే.
ఇక 'చాట్‌జీపీటీ' పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువత తాజాగా 'క్యారెక్టర్.ఏఐ'తో బాగా కనెక్ట్ అయినట్టు భోగట్టా.
"""/" /
'క్యారెక్టర్.ఏఐ' ద్వారా సెలబ్రిటీలు, కాల్పనిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్‌లు, థెరపిస్ట్‌లతో హాయిగా సంభాషించవచ్చట.
'క్యారెక్టర్.ఏఐ'లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత 'క్రియేట్ ఏ క్యారెక్టర్'( Create A Character ) ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది మరి.ఇక ఆ తరువాత సంభాషణ షురూ చేయొచ్చు.
ఉదాహరణకు.'హారి పోటర్' సిరీస్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్‌తో మాట్లాడాలనుకుంటే 'హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్.
ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ' అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ.
"""/" /
అక్కడితో ఆగకుండా తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుండోయ్.క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఒక క్యారెక్టర్‌తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో గ్రూప్ చాట్ చేయవచ్చు.
'క్యారెక్టర్.ఏఐ' అనేది టెక్ట్స్‌కు మాత్రమే పరిమితం కాదు.
ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు.ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు 'క్యారెక్టర్.
ఏఐ'కు సంబంధించి ఆలోచన చేశారు.షాజీర్ 'అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్' పుస్తక రచయితలలో ఒకరు.
ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు