పూరీ కోసం ఛార్మి స్పెషల్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు నెటిజన్స్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, అలాగే నిర్మాత చార్మి లపై భారీగా ట్రోలింగ్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
టైగర్ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ అలాగే చార్మి ముగ్గురు కూడా సోషల్ మీడియాకు కొద్దిరోజుల పాటు దూరం ఉన్నారు.
ఆ సమయంలో ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా వారు స్పందించలేదు.ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా తర్వాత మొట్ట మొదటిసారిగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది చార్మి.
దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.
పూరి ఫోటోను షేర్ చేస్తూ ఎటర్నల్ అంటూ ఎమోజీ ని జత చేసింది చారిని.
ఇందుకు సంబంధించిన టివి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పూరి జగన్నాథ్ అభిమానులు అతనికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
"""/"/
అయితే లైగర్ సినిమా తర్వాత చార్మీ పూరి బర్త్‌డే సందర్భంగా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
జనగణమన ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు.
అంతేకాకుండా లైగర్ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలవడంతో ఆ సినిమాను ఆపేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించ నుంది.
Guide Skrill & Neteller Pour Joueurs Français — Dépôts Et Retraits Mobiles En France