చార్జీ ల్లేని ప్రయాణం.. మహిళా సాధికారతకు సంకేతం..ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: మహాలక్ష్మి పథకం పేరిట కాంగ్రెస్ పార్టీ ( Congress Party )ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని స్థానిక బస్టాండ్ లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం మహిళా సాధికారతకు ఒక సంకేతమని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి వారికి సముచితస్థానం కల్పించామన్నారు.
గత పాలకులు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, మా ప్రభుత్వం పేదలను అక్కున చేర్చుకుంటుందని తెలిపారు.
మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమాలను ఏకకాలంలో సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
జై హనుమాన్ గురించి క్రేజీ అప్ డేట్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. అలా చెప్పడంతో?