గే జంట పై లండన్ లో దాడి

లండన్ లో గే జంటపై కొందరు యువకులు దాడి చేసారు.విధులను ముగించుకుని ఇంటికి వస్తున్న గే జంటపై కొందరు గుర్తుతెలియని యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.

ఉరుగ్వే దేశానికి చెందిన మెలానియా గీమోనా అనే ఉద్యోగి తన అమెరికన్ స్నేహితురాలు క్రిస్‌తో కలిసి లండన్‌ నగరంలో బస్సులో ప్రయాణిస్తున్నసమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు వారి పై దాడికి దిగారు.

ఈ దాడిలో వారిద్దరికీ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.అయితే ఈ ఘటన పై మోలానియా వివరాలను వెల్లడించారు.

మేము బస్సులో కూర్చొని రాత్రి సమయంలో నగర అందాలను వీక్షిస్తున్నాం.మా వెనకాల ఉన్న కొందరు యువకులు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

ముద్దు పెట్టుకోవాలంటూ లైంగికంగా వేధించారు.అనంతరం నా పక్కన ఉన్న క్రిస్‌ను.

నన్ను ముద్దు పెట్టడానికి ప్రయత్నించారు. """/"/ మేము వారిని అడ్డుకున్నాం.

దీంతో వారు కోపంతో మాపై దాడికి దిగారని, అయితే వారంతా కూడా దాదాపు 20 నుంచి 30 ఏళ్ళ వయస్సు ఉన్నవారు గా మోలానియా తెలిపారు.

ఈ సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే వారిపై దాడి చేసిన నలుగురి లో ఒకరు స్పానిష్ మాట్లాడగా,మిగిలిన వారు బ్రిటీష్ యాక్సెంట్ లో మాట్లాడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు.

వారిపై దాడికి దిగడమే కాకుండా వస్తువులను కూడా దోచుకున్నట్లు ఫిర్యాదు లో తెలిపారు.

శుభవార్త చెబుతానంటూ పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్ హన్సిక.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!