ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన అలా చెప్పారా.. 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటూ?
TeluguStop.com
మెగా కోడలు ఉపాసన గర్భవతి అయ్యారనే వార్త మెగా అభిమానులతో పాటు సాధారణ అభిమానులను కూడా సంతోషానికి గురి చేసింది.
పెళ్లైన పదేళ్ల తర్వాత చరణ్ ఉపాసన తల్లీదండ్రులు కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉపాసన గతంలో ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.ఉపాసన ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.
పిల్లల పెంపకం లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
20 సంవత్సరాల పాటు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని ఉపాసన పేర్కొన్నారు.20 సంవత్సరాల జీవితాన్ని తల్లీదండ్రులు పిల్లల కోసం కచ్చితంగా కేటాయించాలని ఆమె కామెంట్లు చేశారు.
ఇందుకు సంబంధించి అవగాహనను కూడా కలిగి ఉండాలని పిల్లల్ని పెంచడానికి సంబంధించి శారీరకంగా మానసికంగా సిద్ధం కావాలని ఉపాసన అభిప్రాయపడ్డారు.
"""/" /
పిల్లలకు మంచి విద్యను అందించడంతో పాటు పిల్లల పెంపకానికి సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.
పిల్లల్ని కనడానికి సరైన టైమ్ ఉంటుందని పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత గడిచిన 20 సంవత్సరాలు వాళ్లను ఏ విధంగా పెంచామనే అవగాహనను మనం కలిగి ఉండటం కూడా ముఖ్యమని ఉపాసన అభిప్రాయపడ్డారు.
ఎలాంటి పొరపాట్లు చేయకుండా పిల్లల్ని పెంచాలని ఆమె అన్నారు.ఉపాసన చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సరైన రీతిలో పిల్లల్ని పెంచితే మాత్రమే వాళ్లు ప్రయోజకులు అయ్యే అవకాశం ఉంటుంది.
ఉపాసనకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆమె ఆటిట్యూడ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఉపాసన వచ్చే ఏడాది బుల్లి ఉపాసన లేదా బుల్లి చరణ్ కు జన్మనిచ్చి శుభవార్త అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం.
సీఎం రేవంత్ ఆదేశించారు… తెలంగాణ వచ్చేయమంటున్న హీరో నాగార్జున ?