మొదటి సారి పుట్టబోయే బిడ్డ గురించి స్పందించిన చరణ్…ఏమన్నారంటే?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఆస్కార్ వేడుకలలో పాల్గొనడం కోసం ఈయన అమెరికా వెళ్లారు.అమెరికాలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ రామ్ చరణ్ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ మరి కొద్ది రోజులలో తండ్రి కాబోతున్నారు అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన తన పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి స్పందించారు.
తాజాగా రామ్ చరణ్ అమెరికాలో ఇంటర్నేషనల్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పలు విషయాలను తెలియజేశారు. """/"/
అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ గైనకాలజిస్ట్ అడిగిన ప్రశ్నలకు రాంచరణ్ ఫన్నీగా సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ రామ్ చరణ్ ప్రశ్నిస్తూ త్వరలోనే తండ్రి కాబోతున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి అని ప్రశ్నించారు.
ఇందుకు రామ్ చరణ్ సమాధానం చెబుతూ ఇంకేముంది కొద్ది రోజులు ప్రయాణాలు, బ్యాగులు సర్దుకోవడంతోనే సరిపోతుంది అంటూ సమాధానం చెప్పారు.
ఇక గైనకాలజిస్ట్ రామ్ చరణ్ కు ఒక సూపర్ ఆఫర్ ఇచ్చారు.మీ మొదటి బిడ్డను నేను డెలివరీ చేస్తాను అది నేను నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను అని చెప్పారు.
"""/"/
ఇక నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను.ప్రపంచం మొత్తం మీ చుట్టూ పర్యటిస్తూ ఉంటానని ఈమె తెలియజేశారు.
ఇలా గైనకాలజిస్ట్ తనకు ఆఫర్ ఇవ్వడంతో రామ్ చరణ్ సైతం తప్పకుండా మీ నెంబర్ తీసుకుంటాను అదే విధంగా ఉపాసన కూడా కొద్ది రోజులు అమెరికాలో ఉండడం కోసం రాబోతుందని రామ్ చరణ్ తెలియజేశారు.
ఇక రామ్ చరణ్ నటించిన RRR సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు.
రాజమౌళి ఇండియన్ స్పీల్ బర్గ్‌గా అభివర్ణించారు.85ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమాకు మాత్రమే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిందన్నారు.
ఇది ఇండియన్ కు.ఇండియన్ టెక్నీషియన్లకు దక్కిన అరుదైన గౌరవం అంటూ డాక్టర్ మాట్లాడటంతో రామ్ చరణ్ ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు ఇలాంటి సంచలనాలను మరెన్నో చూస్తారు అంటూ తెలియజేశారు.
ఆ ఆలయంలో సాయిపల్లవి న్యూ ఇయర్ వేడుకలు.. అక్కడ జరుపుకోవడానికి కారణాలివే!