అందరివాడు అనిపించుకుంటున్న చరణ్.. చిరు తర్వాత చరణ్ మాత్రమేనంటూ?
TeluguStop.com
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలిగి ఉంటే మాత్రమే ఏ రంగంలో అయినా సక్సెస్ కావడం సాధ్యమవుతుంది.
చిరంజీవి స్వయంకృషితో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.
చిరంజీవి అందరివాడు అని ఇండస్ట్రీ మంచి కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేశారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.
అయితే చరణ్ కూడా అందరివాడు అనిపించుకున్నారు. """/"/
ఇండస్ట్రీలో అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతున్న చరణ్ ను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
చరణ్ ఇతర మెగా హీరోలతో స్నేహ పూర్వకంగా మెలగడంతో పాటు అయా హీరోల సినిమాలు సక్సెస్ సాధించడానికి తన వంతు సహాయం చేస్తారు.
ప్రభాస్, శర్వానంద్, రానా చరణ్ కు మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.
ఆర్ సినిమా సక్సెస్ తో చరణ్, తారక్ మధ్య అనుబంధం ఊహించని రేంజ్ లో పెరిగింది.
"""/"/
బాలయ్యతో పలు సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడిన చరణ్ బాలయ్య ప్రశంసలు అందుకున్నారు.
రామ్ చరణ్ పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు కాగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నారు.
వ్యాపారవేత్తగా కూడా చరణ్ సక్సెస్ అవుతున్నారు.రామ్ చరణ్ తండ్రి కానుండగా ఈ ఏడాది ఆగష్టు నెలలో ఉపాసన డెలివరీ ఉంటుందని సమాచారం.
అందరివాడు అవుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు. """/"/
రామ్ చరణ్ నటించిన 14 సినిమాలలో 70 శాతం సినిమాలు సక్సెస్ సాధించాయి.
ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా మిగతా సినిమాలు మాత్రం కమర్షియల్ గా హిట్ అయ్యాయి.
చరణ్ ఖాతాలో మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి.భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా చరణ్ ఇండస్ట్రీ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?