అంబానీ ఫ్యామిలీపై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఎంతో స్ఫూర్తిని పొందాం అంటూ?
TeluguStop.com
ఇటీవల ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.
అనంత్ అంబానీ (Ananth Ambani) రాధిక మర్చంట్ ( Radhika Marchant ) వివాహ వేడుకలలో భాగంగా ఎంతోమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.
బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.
"""/" /
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ పెళ్లి వేడుకలలో రామ్ చరణ్ దంపతులతో పాటు మహేష్ బాబు దంపతులు, వెంకటేష్ దంపతులు కూడా పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన ( Upasana ) రాంచరణ్(Ram Charan) దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
మూడు రోజులపాటు ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.
"""/" /
ఇక ఈ పెళ్లి వేడుకలు పూర్తి అయిన అనంతరం రామ్ చరణ్ అంబానీ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అనంత్ నీ మంచి మనసు మమల్ని ఎంతో ఆశ్చర్యపరిచింది.నీతాజీ ఒక కుమార్తెను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం,భారతీయ సంస్కృతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది.
ముకేశ్‌జీ.మీ అసాధారణమైన ఆతిథ్యం, నిరాడంబరత నుంచి మేం ఎంతో స్ఫూర్తి పొందాం అని చరణ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో మంది సెలబ్రిటీలు రాధిక వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.