పెళ్లి పీటలెక్కనున్న రామ్ చరణ్ హీరోయిన్.. పెళ్లి తేదీ ఎప్పుడంటే?

టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు.ఇప్పటికే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీలో కూడా నటిస్తున్నారు.

అయితే ఫిబ్రవరి నెల 6వ తేదీన ఈ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనున్నారు.సిద్దార్థ్ మల్హోత్రాతో ఈ బ్యూటీ పెళ్లి జరగనుంది.

కొత్త ఏడాదిలో కియారా అద్వానీ పెళ్లి జరగనుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.అయితే అధికారికంగా కియారా అద్వానీ పెళ్లి తేదీకి సంబంధించి ప్రకటన చేయాల్సి ఉంది.

ఈరోజు కియా సిద్దార్థ్ ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరుగుతుండటంతో వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి షాకింగ్ విషయం వెల్లడైంది.

జైసల్మీర్ లోని కోటలో కియారా అద్వానీ సిద్దార్థ్ ల వివాహం జరగనుండగా ఈ వివాహ వేడుక చాలా గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది.

చరణ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త చరణ్ ఫ్యాన్స్ కు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది.

రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే మాత్రం కియారా అద్వానీ మరిన్ని తెలుగు సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రస్తుతం కియారా అద్వానీ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయలుగా ఉందని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.శంకర్ సినిమాతో కియారా ఏ రేంజ్ హిట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.

""img Src=" "/ గతంలోనే కియారా సిద్దార్థ్ పెళ్లి గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.

ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి జరగనుందని తెలుస్తోంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో హీరోయిన్ గా కూడా కియారా అద్వానీ పేరు వినిపించగా అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తారో లేదో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఆ ప్లాప్ సినిమాను వదిలేసి మంచి పని చేసిన పవన్ కళ్యాణ్…