అక్షర ఉచిత వేసవి శిక్షణ తరగతులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:అక్షర ఫౌండేషన్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో స్వశోధన్ ట్రస్ట్-హైదరాబాద్ వారి సౌజన్యంతో తేదీ:02-05-2022 సోమవారం నుండి సూర్యాపేట పబ్లిక్ స్కూల్ నందు నిర్వహించే అక్షర ఉచిత వేసవి శిక్షణ తరగతుల కరపత్రాలను జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు శనివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో చెడు మార్గాలలో పడకుండా,దురలవాట్లకు గురికాకుండా అక్షర వేసవి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు.
ఈ శిక్షణ వలన విద్యార్థులకు మన సంస్కృతితో పాటు విజ్ఞానం, వికాసం,మానసిక ప్రశాంతత,మనోల్లాసం కలుగుతుందన్నారు.
విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ శిక్షణ ద్వారా ధ్యానం,యోగ,స్పోకెన్ ఇంగ్లీషు, మాథ్స్ ఓరియంటెషన్,కరాటే,హ్యాండ్ రైటింగ్, డాన్సులు,కోలాటం,డ్రాయింగ్,ఫ్లూట్,కంప్యూటర్, వ్యక్తిత్వ వికాసం అంశాలపై ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ ఉంటుందని తెలిపారు.
పూర్తి సమాచారం కొరకు 9030681533, 7036259922 లను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి,విశ్రాంత స్టేట్ రిసోర్స్ పర్సన్ యానాల వెంకట్ రెడ్డి,అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పు నాగయ్య,పాల్వాయి వెంకన్న, ఉపాధ్యక్షులు నరాల తిరుమలరెడ్డి,జనార్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.
Hajper Customer Support And Service Quality: A Practical Guide For UK Players