Jayalalita : కోట్ల ఆస్తులు పోగొట్టుకుని ఆటోలో తిరుగుతున్న జయలలిత.. మెగా బ్రదర్ సాయం చేశాడంటూ?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో జయలలిత ఒకరు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీని పెంచుకున్న జయలలిత ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
పలు సీరియళ్లలో కూడా నటిస్తున్న జయలలిత( Jayalalita ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
లక్ష్మీదేవిని నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టే నా నుంచి వెళ్లిపోయిందేమో అని అనుకుంటున్నానని ఆమె తెలిపారు.
నేను 4 కోట్ల రూపాయలు నష్టపోయినా ఇండస్ట్రీలో ఎవరూ సహాయం చేయలేదని జయలలిత కామెంట్లు చేశారు.
నాగబాబు( Nagendra Babu ) గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడానికి నేను ఇష్టపడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
"""/" /
పాత హీరో సురేష్( Suresh ) తో కలిసి షష్టిపూర్తి సీన్ లో యాక్ట్ చేశానని పెళ్లంటే ఇలా చేసుకోవాలని అనుకున్నానని జయలలిత పేర్కొన్నారు.
నేను ఆటోలో వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.రుద్రమకోట ప్రమోషన్స్ కోసం చాలామందిని కలవగా వాళ్లెవరూ సాయం చేయలేదని జయలలిత పేర్కొన్నారు.
అనిల్ అనే వ్యక్తి అప్పుల్లో ఉండి కూడా కారు ఇచ్చాడని అమె అన్నారు.
"""/" /
ఆ కారు ఉన్నా కూడా నాకు ఆనందం లేదని ఆ తృప్తి కూడా లేదని జయలలిత పేర్కొన్నారు.
మనది కానిది మనకు తృప్తిని ఇవ్వదని జయలలిత చెప్పుకొచ్చారు.నేను చాలా సామాన్యమైన బ్రాహ్మణ అమ్మాయినని అలాంటి నేను వ్యాంప్ రోల్స్ లో చేశానని జయలలిత కామెంట్లు చేశారు.
నన్ను మోసం చేసిన వ్యక్తి చాలామందిని కూడా మోసం చేసి ఐపీ పెట్టి వెళ్లిపోయాడని జయలలిత అన్నారు.
జయలలిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జయలలిత కన్నీటి కష్టాలు తీరాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 3, ఆదివారం 2024