చనిపోతున్నట్లు ప్రేయసికి మెసేజ్ చేసాడు ఆ ప్రియుడు..! వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా.?

నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు.

కానీ కలిసి రాని కాలం కన్నెర్ర చేసింది.విధి ఆడిన వింత నాటకం వారిని బలితీసుకుంది.

ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చంటి(25), రాధిక(19) నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

చంటి మేస్త్రీ పనులు చేస్తూ ఉండేవాడు.రాధిక ఓ బ్యాంకు లో పనిచేసేది.

వారు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే వీరి ప్రేమను ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకోలేదు.

అదే సమయంలో రాధికకు వేరొకరితో పెళ్లి చేయాలనీ నిశ్చయించారు ఆమె తల్లితండ్రులు.తన ప్రేయసి తనకు కాకుండా వేరొకరికి సొంతమవుతోందన్న మనస్థాపంతో చంటి తాను చనిపోతున్నట్లు తన ప్రేయసికి మెసేజ్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చంటి చనిపోయాడు అని తెలియగానే రాధిక కోయిల్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్‌ తెలిపారు.