చంటి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రాఘవేంద్ర హీరోగా ఎన్ని సినిమాల్లో నటించాడు..!
TeluguStop.com
ఇండస్ట్రీలో చాలామంది వాళ్లకంటూ ఓ గుర్తింపు రావడం కోసం తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కొందరు హీరోలుగా సక్సెస్ అయితే కొందరు కామెడీయన్ గా ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోతు ఉంటారు.
వీళ్లు ఇలా ఉంటే కొందరైతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి వాళ్ళకంటూ గుర్తింపు సాధించుకుంటారు అలాంటి వారు కొందరు పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా మారతారు.
అందులో శ్రీదేవి, మీనా,రాశి లాంటి వారు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు సాధించారు.
అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అందరు హీరోలు హీరోయిన్లుగా మారతారని గ్యారెంటీ లేదు అందుకు ఉదాహరణగా సౌందర్య లీడ్ రోల్ లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అమ్మోరు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ పరిచయమైన సునైనా బాదం నీ చెప్పుకోవచ్చు.
ఆమె అమ్మోరు సినిమా లో దేవత గా నటించి అందరి మన్నలను పొందింది.
ఆ సినిమాలో సౌందర్యని ఇంట్లో వాళ్ళందరూ బాధిస్తుంటే కాపాడే దేవతగా వచ్చే క్యారెక్టర్లో సునైనా అద్భుతంగా చేసిందనే చెప్పాలి.
అయినప్పటికీ తను హీరోయిన్ గా ఏ సినిమాలో కూడా చేయలేక పోయింది ప్రస్తుతం వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ లో చేసుకుంటూ బిజీగా ఉంటుంది.
ఒకప్పుడు బాలాదిత్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా కొన్ని సినిమాలు చేసి అనతి కాలంలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.
అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తో పాపులర్ అయిన అక్కచెల్లెళ్ళు షాలిని, బేబీ షామిలీ లు కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
అందులో షాలిని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని హీరో అజిత్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు వాళ్ళ చెల్లి అయిన బేబీ షామిలి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది ఆనంద్ రంగ దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ఓయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
"""/"/
అలాగే వెంకటేష్ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ సినిమా హిందీలో కూడా అనారి పేరుతో వెంకటేష్ హీరోగా కరిష్మా కపూర్ చేసి మంచి విజయాన్ని సాధించింది.
అయితే చంటి సినిమాలో చిన్నప్పుడు వెంకటేష్ క్యారెక్టర్ చేసిన అజయ్ రాఘవేంద్ర గురించి చెప్పాలంటే అతను అప్పుడే తన వయస్సుకు మించిన క్యారెక్టర్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు అలాంటి రాఘవేంద్ర హీరోగా కూడా మారి మా బాపు బొమ్మకు పెళ్ళంట అనే సినిమా చేశాడు నటన పరంగా మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా దాంతో తర్వాత ఆయన ఏం సినిమాలు చేయలేదు అలాగే చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన మౌనిక కూడా అల్లరి నరేష్ హీరోగా మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో నటించింది ఆ తర్వాత శివరామరాజు సినిమా లో జగపతిబాబు, వెంకట్, శివాజీ లా చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు సాధించింది అయినప్పటికీ తను పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి దాంతో అన్ని సినిమాలు చేయడం మానేసి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.
ఒకప్పుడు చిరంజీవి ఇంద్ర సినిమాలో చిరంజీవి చిన్నప్పుడు పాత్ర చేసిన తేజ ఈ మధ్య ఓ బేబీ మూవీతోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.
ప్రస్తుతం జాంబి రెడ్డి సినిమాతో సోలో హీరోగా సక్సెస్ కూడా కొట్టాడు.తేజ కూడా ఫ్యూచర్ లో పెద్ద హీరో అవుతాడో లేదా వీళ్ళ లాగే మిగిలిపోతాడో చూడాలి.
40 లోనూ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ రెమెడీని మిస్ అవ్వకండి!