మైలవరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram )లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.ఏలూరులో జరిగే ‘సిద్ధం’ సభకు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

"""/" / సభకు తాను అందుబాటులో ఉండటం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Vasantha Krishnaprasad ) చెప్పారు.

దీంతో రంగంలోకి దిగిన వైసీపీ హైకమాండ్ కేశినేని నాని( Kesineni Nani )తో పాటు నియోజకవర్గ ఇంఛార్జ్ పడమట సురేశ్ బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది.

సిద్ధం సభకు మైలవరం నుంచి భారీగా జనసమీకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.ఈ క్రమంలో నియోజకవర్గ నేతలతో కేశినేని నాని, పడమట సురేశ్ బాబు కీలక సమావేశం నిర్వహించారు.

మరోవైపు సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఆయన వైసీపీని వీడుతారనే ప్రచారానికి బలం చేకూరిందని తెలుస్తోంది.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?