ఖమ్మం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధాన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కొందరు నేతలు అలక వహించారని సమాచారం.
ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమైన నేతలకు సీటు రాలేదు.
దీంతో రాయల నాగేశ్వర రావు, పోట్ల నాగేశ్వర రావు, ఎస్డీ జావేద్ తో పాటు సున్నం నాగమణి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న నేతలను తుమ్మల, పొంగులేటి సముదాయిస్తున్నప్పటికీ వీరంతా కాంగ్రెస్ వీడనున్నారని తెలుస్తోంది.
దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!