మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

సాధారణంగా ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంది.

ఈ క్రమంలోనే చాలామంది హస్తసాముద్రికాన్ని విశ్వసిస్తారు.అందుకోసమే చాలా మంది జ్యోతిష్య నిపుణుల వద్దకు వెళ్లి వారి చేతి గీతలను చూపించి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే తెలుసుకుంటారు.

ఇలా భవిష్యత్తు తెలుసుకోవాలనే ఇష్టత ఉండడం మానవుని నైజం.చాలామంది ఈ హస్తసాముద్రికం పై ఎంతో నమ్మకం పెట్టుకుంటారు.

ఒక బిడ్డ జన్మించినప్పుడు తన చేతిలో ఉన్నటువంటి గీతలు ఎంతో చక్కగా ఉంటాయి.

అయితే క్రమంగా బిడ్డ పెరిగేకొద్దీ చేతి గీతలలో మార్పులు వస్తాయి.నిజంగానే మన చేతి గీతలలో మార్పులు వస్తాయా.

ఈ మార్పులు దేనికి సంకేతం.ఈ మార్పులు వల్ల భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే సందేహాలు చాలా మంది వ్యక్త పరుస్తారు.

అయితే ఇందులో ఏ మాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు.మనం పెరిగేకొద్దీ కాలానికి అనుగుణంగా మన చేతిలో గీతలు కూడా మారుతాయి.

ఇలా చేతి గీతలు మారినంత మాత్రాన హస్తసాముద్రికం మారదు.ఈ చేతి గీతలు మారడం అనేది ఆ వ్యక్తి ప్రవర్తన, అతను చేసే పనుల పై ఆధారపడి ఉంటుంది.

"""/" / మన జీవితంలో మనకు కలిగే సంతోషాలు, కష్టాలు, నష్టాలు గురించి చేతి గీతలు తెలియజేస్తాయి.

ఈ చేతి గీతల ఆధారంగా తన వైవాహిక జీవితం, ఇక జీవితంలో ఎదురయ్యే కష్టాలు పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మొత్తం ఈ హస్తసాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు.

భవిష్యత్తులో మనం ఎలాంటి విజయాలను అందుకుంటారు,ఎలాంటి అవమానాలను ఎదుర్కొంటారు అనే విషయాలను తెలుపుతుంది.

అయితే చాలామంది హస్తసాముద్రికం నమ్ముతారు.మరికొందరు చేతి గీతలతో తలరాతను పోల్చకండి అంటూ కొట్టి పారేస్తారు.

ఇక మరికొందరు చేతులు లేని వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది కదా.అంటూ హస్తసాముద్రికం నమ్మరు.

అయినప్పటికీ ఎవరి నమ్మకం వారిది.జ్యోతిషశాస్త్ర నిపుణులు మాత్రం మనిషి భవిష్యత్తును చేతి గీతలు తెలియజేస్తాయని, వారి జీవితం ఎలా కొనసాగుతుందో వారి చేతి గీతలే తెలియజేస్తాయని చెబుతున్నారు.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…