నేడు చంద్రబాబు పర్యటనలో మార్పులు
TeluguStop.com
ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలలో అలుపు ఎరగకుండా శ్రమిస్తూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ , తగిన సూచనలు చేస్తూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు మిగిలిన ప్రాంతాల లోని వరద పరిస్థితులను స్వయంగా తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.
అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చేపట్టారు అధికారులు.
"""/" /
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు( West Godavari District Aakiveedu ) లో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా, అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన పర్యటంలో స్వల్ప మార్పులు చేశారు .
పశ్చిమగోదావరి జిల్లా లో చంద్రబాబు పర్యటన ను రద్దు చేశారు అధికారులు .
పశ్చిమగోదావరి జిల్లాకు బదులుగా ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.ముందుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని తన నివాసం నుంచి ఉదయం 10.
30 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా కైకలూరు, కొల్లేరు( Kaikaluru, Kolleru ) ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు .
"""/" / అనంతరం ఉదయం 11.10 గంటలకు హెలికాఫ్టర్ లో ఏలూరు సి.
ఆర్ రెడ్డి కళాశాలలో( Eluru In CR Reddy College ) ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు.
ఉదయం 11.25 గంటలకు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించనున్నారు.
11.45 కు సి ఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంకు చంద్రబాబు చేరుకుంటారు.
అక్కడ రైతులు , వరద బాధితులతో స్వయంగా చంద్రబాబు మాట్లాడుతారు.ఆ తర్వాత మధ్యాహ్నం 12.
30 కి సిఆర్ రెడ్డి కళాశాల హెలి ఫ్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్ లో సామర్లకోటకు చేరుకుంటారు.
సామర్లకోట లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏలూరు ఆధునికరణ పై తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు రివ్యూ సమావేశం నిర్వహిస్తారు.
సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అవ్వకపోతే ఏం చేసేవాడో తెలుసా..?