పార్టీ మారిన నేతలకు బుద్ధి చెప్పాలి..: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన బీఆర్ఎస్( BRS ) తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా బుద్వేల్ లో చేసిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే పార్టీ మారిన నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.కష్టకాలంలో ఉన్న పార్టీని కాదని వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా పని చేసే నేతలకు గుణపాఠం చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆ( KCR )ర్ అవకాశాలు ఇస్తే ప్రజల మద్ధతుతో గెలిచి ఈ రోజు వేరే పార్టీలోకి వెళ్లారని మండిపడ్డారు.

ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి( Ranjith Reddy ) బుద్ధి చెప్పాలని కోరారు.

అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించగలమని కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ కు 150 కంటే ఎక్కువ సీట్లు రావన్న ఆయన బీజేపీకి( BJP ) 200 సీట్లు కూడా రావని చెప్పారు.

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని విమర్శించారు.

వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?