ఫోన్ లుక్ మార్చేయాలనుకుంటున్నారా? అయితే గూగుల్ ఫీచర్ ట్రై చేయండిలా!

మనలో చాలామంది తమ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లుక్ ని ఎప్పటికప్పుడు మార్చివేయాలని అనుకుంటూవుంటారు.

కానీ దానికి సంబంధిత యాప్స్ వారికి అంతగా అందుబాటులో లేవనే చెప్పుకోవాలి.కొన్ని లాంచర్లు ఉన్నప్పటికీ అవ్వి పూర్తి స్థాయిలో మొబైల్ లుక్ ని మార్చలేవు.

కేవలం ఇవి మొబైల్ మెనూని మాత్రమే మార్చగలవు.ఈ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచి మేరకు గూగుల్ మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో డీఫాల్ట్‌గా ఉండే స్క్రీన్‌ సేవర్‌లతో విసిగిపోయి ఉంటే, నచ్చిన ఫొటోలను స్క్రీన్‌ సేవర్‌ లుగా ఎంచుకొనే అవకాశం ఉంది.

ఫోన్‌ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడుగానీ, సాధారణంగా వినియోగించకుండా పక్కన పెట్టి ఉన్నప్పుడు గానీ మీ ఫేవరెట్‌ చిత్రాలను స్క్రీన్ సేవర్‌లో చేసే వీలుంది.

ఫోన్‌ టర్న్డ్‌ డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌ ద్వారా ఇష్టమైన ఫొటోలను స్క్రీన్‌పై కనిపించేలా చేసుకొనే అవకాశాన్ని గూగుల్‌ కల్పించింది.

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో బిల్ట్‌ఇన్‌గా వచ్చిన ఈ ఫీచర్‌ను కొన్ని సులువైన స్టెప్‌ల ద్వారా పొందవచ్చు.

వినియోగదారులు అదనంగా దీనికోసం అప్లికేషన్‌లు డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు.క్రింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

1.ముందుగా ఫోన్‌ అన్‌లాక్‌ చేసి, సెట్టింగ్స్‌ మెనూకు వెళ్లాలి.

తరువాత డిప్‌ప్లే మెనూపై క్లిక్‌ చేసి స్క్రీన్ సేవర్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

2.తర్వాత కరెంట్‌ స్క్రీన్ సేవర్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసి గూగుల్‌ ఫొటోస్‌ యాప్ ఐకాన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

అనంతరం స్కీన్‌ సేవర్‌ మెనూ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.3.

తర్వాత మెయిన్ స్క్రీన్‌ సేవర్‌ మెనూ పేజ్‌కు వెళ్లి ‘వెన్‌ టూ స్టార్ట్‌’ అనే ఆప్షన్‌ సెలక్ట్‌ చేయాలి.

తర్వాత ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, వినియోగించకుండా పక్క పెట్టినప్పుడు, లేదా రెండు సందర్భాల్లో స్క్రీన్‌ సేవర్‌ రావాలా? అనే ఆప్షన్లను ఎంచుకోవాలి.

"""/" / 4.దానితరువాత మెయిన్‌ స్క్రీన్ సేవర్ మెనూకి తిరిగి వెళ్లి ప్రివ్యూ లేదా స్టార్ట్‌ నౌ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేస్తే.

ఎంచుకొన్న స్క్రీన్‌ సేవర్‌ కనిపిస్తుంది.5.

స్క్రీన్ సేవర్.సంబంధిత ఫోన్‌ ఆల్బమ్‌లోని ఏ క్రమంలో సెలక్ట్‌ చేసి ఉంటే అదే క్రమంలో చూపుతుంది.

డీఫాల్ట్‌ స్క్రీన్‌ సేవర్‌లతో విసుగు చెంది ఉంటే.నచ్చిన ఫొటోలతో ఆటో అప్‌డేట్‌ ఆల్బమ్‌ను కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు.

ఆటో అప్‌డేటింగ్‌ ఆల్బమ్‌ను క్రియేట్‌ చేయడానికి గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ ఓపన్‌ చేసి.

స్రీన్ బాటమ్‌లోని లైబ్రరీ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి.ఈ విధంగా పై స్టెప్స్ ని అనుసరించి మీయొక్క ఫోన్ లుక్కిని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

జనాలు మెచ్చేలా వైసీపీ కొత్త మేనిఫెస్టో.. ఇక జగన్ కు తిరుగులేనట్టే ?