గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పు ! ఎవరెక్కడో తేలేది నేడే ? 

వచ్చే ఎన్నికల్లో వైసీపీ( Ycp ) తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబుతాను విడతల వారీగా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) నిర్ణయించుకున్నారు.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 90% మందిని మార్చే ఆలోచనతో ఉన్నారు.ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించారు.

జిల్లాల వారీగా రెండో జాబితాను విడుదల చేసినందుకు కసరత్తు చేస్తున్నారు .ఇప్పటికే టికెట్ దక్కి అవకాశం లేదనుకున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని జగన్ వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు.

దీంతో క్యాంపు కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది.టికెట్ పై టెన్షన్ గా ఉన్న నేతలు జగన్ కలిసేందుకు క్యూ కట్టేస్తున్నారు.

జగన్ నుంచి పిలుపు అందుకున్న వారు, అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు , ఇలా అంతా తాడేపల్లి లో వాలిపోతున్నారు.

ఇది ఇలా ఉంటే వైసీపీకి 2019 ఎన్నికల్లో అండగా నిలిచిన ఉభయగోదావరి జిల్లాల్లో ఏఏ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది .

"""/" / ఈ రెండు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది జగన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నారు.

దీనికి అనుగుణంగా మార్పులు,  చేపట్టేందుకు సిద్ధమయ్యారు.ఈరోజు సాయంత్రానికి ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలకు నియోజకవర్గ ఇన్చార్జిల జాబితాను జగన్ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ రెండు జిల్లాల్లో టిడిపి , జనసేన( TDP, Jana Sena ) ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనే సర్వే నివేదికలతో అలర్ట్ అవుతున్న జగన్ కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల సమీకరణను ప్రాతిపదికగా తీసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి,  వారి స్థానంలో కొత్తవారిని నియమించే ఆలోచనతో ఉన్నారు .

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు ఇవేనంటూ హడావుడి జరుగుతోంది.ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, ఉండి, నరసాపురం, భీమవరం, ఏలూరు చింతలపూడి పోలవరం, కొవ్వూరు, గోపాలపురం తదితర నియోజకవర్గాల లో మార్పులు తప్పవు అనే ప్రచారం జరుగుతుంది.

"""/" / ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని భారీగా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్( Bharath ) కు ఈసారి  అసెంబ్లీ సీటు అలాగే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రామచంద్రపురం, కేటాయించే అవకాశం ఉందట .

ఇక అమలాపురం, కొత్తపేట, తదితర నియోజకవర్గాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందట.

ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?