గందరగోళంలో కర్నాటక సీఎం.. పదవికే ఎసరు పెడుతున్నారట.. !
TeluguStop.com
రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు.అలాగని ఉన్నంత కాలంలో తమపలుకుబడి ఊపయోగించి రాజకీయాల్లో పాతుకుపోతున్న నేతలు, రెండు చేతుల సంపాదించుకుంటున్న నాయకులు ఉన్నారు.
అవకాశం చిక్కినప్పుడే అందిన వైభోగాలు అనుభవిస్తూ వెనకేసుకుంటున్నారు.ఎందుకంటే గ్యారంటీ లేని పదవులు ఊడిపోయాక బాధపడి ఏం లాభం అనే నీతిని చాలా మంది రాజకీయనేతలు ఒంటపట్టించుకున్నారు కాబట్టి.
ఇకపోతే కర్నాటక రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.కర్నాటక ప్రస్తుత సీఎం యడియూరప్పను మార్చి మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం రోజు రోజుకు ఊపందుకుంటుంది.
అయితే కర్నాటక బీజేపీ నేతలు మాత్రం అదేంకాదని విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నా యడియూరప్ప పనితీరుపై అసమ్మతి నేతలు తరచూ ఫిర్యాదులో చేస్తుండటంతో బీజేపీ అగ్రనాయకత్వం ఆయనను తప్పించేందుకు నిర్ణయం తీసుకుందని హైకమాండ్ కు సన్నిహితంగా ఉన్న వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తానికి యడియూరప్ప రాజకీయ పదవికి ఎసరు పెడుతున్నారట.
కొరటాల శివ నెక్స్ట్ దేవర 2 చేస్తున్నాడా.? ఎన్టీఆర్ మాటల్లో నిజం ఉందా..?