తెలంగాణలో మార్పు తిరోగమనం వైపు కనిపిస్తోంది..: జగదీశ్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణలో మార్పు తిరోగమనం వైపు కనిపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చే సోయి కాంగ్రెస్ నేతలకు లేదా అని ప్రశ్నించారు.
పంటలు ఎండిపోతున్నాయని పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని వెల్లడించారు.రైతుబంధు రాలేదని ప్రశ్నిస్తే ఓ మంత్రి చెప్పుతో కొడుతానంటున్నారని ఆరోపించారు.
సాగునీటిపై ప్రభుత్వం ఒక్కరోజైనా సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి పోతారో ఎవరికి తెలుసని ప్రశ్నించారు.
త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్న అల్లు అర్జున్…కథ మారిపోయిందా..?