ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే చంద్రయాన్3 బడ్జెట్ తక్కువా.. నమ్మకపోయినా నిజమిదే!

ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఆదిపురుష్ ( Adipurush )మూవీ ఏకంగా 700 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కింది.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని సమాచారం అందుతోంది.

అయితే ఈ సినిమా ఫుల్ రన్ లో కొంతమేర నష్టాలను మిగిల్చింది.ఈ సినిమాలో ప్రభాస్ కాకుండా మరొకరు నటించి ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువ మొత్తంలో నష్టాలు వచ్చేవని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే చంద్రయాన్3 బడ్జెట్ తక్కువని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చంద్రయాన్3( Chandrayaan 3 ) బడ్జెట్ కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలుస్తోంది.

ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతోనే చంద్రయాన్3 ను ప్రయోగించారు.ఇస్రో శాస్త్రవేత్తలు( ISRO Scientists ) చంద్రయాన్3 ను విజయవంతంగా ప్రయోగించడం గమనార్హం.

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి చంద్రయాన్3 దూసుకెళ్లింది. """/" / ఆదిపురుష్ సినిమాలో కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటించగా సీత పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆదిపురుష్ సినిమా రిజల్ట్ వల్ల ఓం రౌత్ కు కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ సైతం మైథలాజికల్ సినిమాలకు దూరంగా ఉండాలని కొంతమంది చెబుతున్నారు.ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

"""/" / ప్రభాస్ నిర్మాతలు ఎవరైనా ఒకే మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తే 80 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం.

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ప్రాజెక్ట్ కే విడుదల తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని కొత్త తరహా కాన్సెప్ట్ లకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

ఆడపిల్లలకు అన్యాయం జరిగితే కోపం వస్తుంది.. బన్నీ సంచలన వ్యాఖ్యలు వైరల్!