భయపడ్డట్లే జరిగింది, సాధించింది తక్కువేం కాదు
TeluguStop.com
చంద్రయాన్ ల్యాండ్ కోసం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఆసక్తిగా చూశారు.
అత్యంత ఆసక్తిని కలిగించిన చంద్రయాన్ ల్యాండింగ్ విషయంలో ఇస్రో చైర్మన్ అంతకు ముందు చెప్పినట్లుగానే ఆ 15 నిమిషాలు అత్యంత కష్టంగా సాగాయి.
ప్రయోగం మొత్తం ఒక ఎత్తయితే, ఆ పదిహేను నిమిషాలు ఒక ఎత్తు అయ్యింది.
అనుకున్నట్లుగానే ఆ పదిహేను నిమిషాల్లో 13 నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది.
కాని చివరి రెండు నిమిషాల్లో సాంకేతిక కారణంగా చంద్రయాన్‌తో కనెక్షన్ తెగిపోయింది.చంద్రుడికి 2.
1 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 2 ఆగిపోయిందని ఇస్రో బాధగా ప్రకటించింది.అర్ధరాత్రి దాటిన తర్వాత టీవీలకు అతక్కు పోయి కూర్చున్న వారు కాస్త నిరాశతో టీవీలను ఆఫ్ చేశారు.
</br>
ప్రయోగంను ప్రత్యక్షంగా చూసేందుకు బెంగళూరు ఇస్రో కేంద్రంకు వెళ్లిన ప్రధాని మోడీ కూడా తిరుగు ప్రయాణం అయ్యారు.
ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ విఫలం అయ్యిందని బాధ అక్కర్లేదు.మీరు దీని కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మాకు తెలుసు.
దేశం మొత్తం మీకు మద్దతుగా ఉంది.ముందు ముందు మరిన్ని అద్బుతాలను మీరు ఆవిష్కరిస్తారని మేము నమ్ముతున్నాం.
ఈ ప్రయోగంలో మీరు చాలా సాధించారు.దేశం గర్వించేలా మీరు చేశారంటూ మోడీ ప్రశంసించారు.
ప్రతి ఒక్కరు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేయాలి.వారు ప్రపంచం మొత్తం ఇండియా వైపు తిరిగి చూసేలా చేశారు.
ఈ అద్బుతం కొద్దిలో తప్పినా కూడా ముందు ముందు తప్పకుండా ఇస్రో మరిన్ని విజయాలను అందుకుంటుందనే నమ్మకంను దేశ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.