చంద్రయాన్‌ 2 : మరో అప్‌డేట్‌ ఇచ్చిన ఇస్రో

మొన్న శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రుడిపై ఇండియా ముద్ర పడుతుందని దేశ ప్రజలు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

కాని చంద్రయాన్‌ 2 ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా విఫలం అయ్యింది.

చంద్రయాన్‌ 2 తీసుకు వెళ్లిన ల్యాండర్‌ విక్రమ్‌ క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యిందని, దాంతో చంద్రయాన్‌ మ్కులుగా అయ్యి ఉంటుందని కొందరు భావించారు.

కాని తాజాగా ఆర్బిటాల్‌ పంపించిన ఛాయా చిత్రం ద్వారా ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించడం జరిగింది.

ఇటీవలే ల్యాండర్‌ విక్రమ్‌ను గుర్తించినట్లుగా ప్రకటించిన ఇస్రో తాజాగా ల్యాండర్‌కు ఎలాంటి సమస్య తలెత్తలేదని సింగిల్‌ పీస్‌గానే ల్యాండర్‌ ఉందని గుర్తించినట్లుగా ప్రకటించారు.

ల్యాండర్‌ విక్రమ్‌ నుండి సిగ్నల్స్‌ను అందుకునేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తోంది.

ల్యాండర్‌ జాడ తెలవడం మరియు ల్యాండర్‌ క్రాష్‌ ల్యాండ్‌ అయినా ముక్కలు కాకుండా ఉండటంతో శాస్త్రవేత్తలు కాస్త ఉపశమనం పొందారు.

అయితే ల్యాండర్‌ నుండి సిగ్నల్స్‌ను అందుకోవడం అంత సులభం కాదంటున్న శాస్త్రవేత్తలు అందుకోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మన శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం దక్కి విక్రమ్‌తో సిగ్నల్స్‌ పునరుద్దరించబడాలని కోరుకుందాం.