చంద్రయాన్-3 విజయవంతం.. ఏపీకి ప్రత్యేకం సీఎం జగన్ ట్వీట్..!!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా భారత్( India ) పేరు మారుమొగుతుంది.చంద్రయాన్-3 ప్రయోగం( Chandrayaan 3 ) విజయవంతం కావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు.చంద్రుడిపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ దిగటంతో ఇస్రో చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్( AP CM YS Jagan ) ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
"ఇది భారత్ కు ప్రత్యేకమైన విజయం.చంద్రునిపై చంద్రాయన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు నాతో సహా దేశంలో ప్రతి పౌరుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు.
ఇస్రో బృందానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు."ఈ అపురూపమైన ఘట్టాన్ని శ్రీహరి కోట( Sriharikota )నుంచే సాధించాం.
ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకం" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.మొన్నటి వరకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన దేశాల లిస్టులో అమెరికా, యుఎస్ఎస్ఆర్, చైనా దేశాలు మాత్రమే ఉండగా ఇప్పుడు నాలుగో దేశంగా భారత్.
రికార్డు సృష్టించింది.ఇక ఇదే సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది.
చంద్రాయన్-3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు శాస్త్రవేత్తలు భారత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. కోమాలో కూతురు, అత్యవసర వీసాకై తల్లిదండ్రుల నిరీక్షణ