మరో మూడు నెలల్లో చంద్రన్న రాజ్యం వస్తుంది..: నిర్మాత నట్టికుమార్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చిత్ర నిర్మాత నట్టికుమార్ తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నిర్మాత నట్టికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలను కించపరిచేందుకే డైరెక్టర్ ఆర్జీవీ వ్యూహం సినిమా చేశారన్న ఆయన అందుకే రామ్ గోపాల్ వర్మ సినిమాకు న్యాయస్థానం బ్రేక్ వేసిందని చెప్పారు.

ఈ తరహాలోనే 2024 ఎన్నికల్లో వైసీపీకి బ్రేక్ పడుతుందని తెలిపారు.ప్రజలు పడుతున్న బాధలు సీఎం జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో చంద్రన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిసారి నెలసరి ఆలస్యం అవుతుందా.. అయితే ఇదే బెస్ట్ సొల్యూషన్..!