జగన్ మీద చంద్రన్న ఘరం.. ఘరం..
TeluguStop.com
తాజాగా టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.
జగన్ మోహన్ రెడ్డి ఓ ఫేక్ ముఖ్యమంత్రి అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు.
తాజాగా ఆయన సభ నుండి సస్పెండ్ కు గురి అయ్యాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.
జగన్ మోహన్ రెడ్డి పై అనేక విమర్శలు చేశారు.ఇందులో భాగంగా వర్షాలు, వరదలు, పంట నష్టం పై లేనిపోని పనికిమాలిన కబుర్లు చెబుతోందని అలాగే ఒక్క సంవత్సరంలోనే లక్షా 25 వేల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.
ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రామానాయుడు పై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ఆయన ప్రశ్నించారు.
వీటితో పాటు తన జీవితంలో తానెప్పుడు సభలోని వెల్ లోకి వెళ్ళలేదని, అలాగే పరిటాల రవి హత్య సందర్భంలో కూడా తాను వెళ్లలేదని.
కాకపోతే రైతుల విషయంలో జగన్ మోహన్ రెడ్డి తీరు నచ్చక తాను ఇలా బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
"""/"/
ఇందులో భాగంగానే గాలికి వచ్చారు.గాలికి పోతారు.
అంటూ చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వీటితో పాటు ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తును అడ్డుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు జగన్ పై ఫైర్ అయ్యాడు.
వీటితోపాటు గాలి మాటలు చెప్పే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ బాబు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సబ్సిడీని నాశనం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.రైతుల కోసం ప్రీమియం చెల్లించకుండా పంటల బీమా భవిష్యత్తును నాశనం చేస్తున్నట్లు చంద్రబాబు తప్పు పట్టారు.
ఒకవేళ ప్రీమియం కట్టి ఉంటే రైతులకు బీమా సౌకర్యం వచ్చేదని కాకపోతే జగన్ చేతగాని తనం వల్లే రైతులు నష్టపోయారని బాబు పేర్కొన్నాడు.
తన రాజకీయ అనుభవం అంతా అంటూ ఆయన తీవ్రంగా జగన్ పై విమర్శలు చేశారు.
కళ్యాణ్ రామ్ కు అదే మైనస్ అవుతోందా.. అలాంటి కథలను ఎంచుకుంటే బెటర్!