చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ కు సన్నాహాలు.. డేట్ అండ్ వెన్యూ ఎక్కడంటే?
TeluguStop.com
సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో 'చంద్రముఖి 2'( Chandramukhi 2 ) ఒకటి.
దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చంద్రముఖి సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు.రజనీకాంత్ కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.
2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని అప్పుడే ప్రకటన వచ్చింది.కానీ ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇన్నేళ్ల సమయం పట్టింది.
అయితే ఈసారి ఈ సినిమా సీక్వెల్ లో రజనీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) నటించారు.
ఈయనకు జోడీగా కంగనా రనౌత్( Kangana Ranaut ) హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం అంచనాలు పెరిగాయి.
"""/" /
ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.
ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది అని తెలియడంతో చంద్రముఖి ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.
ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
"""/" /
అసలు ఈ మూవీ వినాయక చవితి కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదా వేసి సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మరి ఈ రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండడంతో రిలీజ్ కు అన్ని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్( Chandramukhi 2 Pre-Release Event ) గురించి అప్డేట్ తెలుస్తుంది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 24న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
ఈ వేడుకకు లారెన్స్, కంగనాతో పాటు ఎంటైర్ టీమ్ అంతా పాల్గొననున్నారని తెలుస్తుంది.
ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’