పేరు అడిగితే తారక్ అలా చెప్పేవారట.. చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.ఏ సినిమాలో నటించినా తన నటనతో తారక్ మెప్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోగల టాలెంట్ ఉన్నవారని చెప్పవచ్చు.

సీనియర్ నటుడు చంద్రమోహన్, తారక్ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ తారక్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు పుట్టలేదని చంద్రమోహన్ అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం మూవీలో నటించినప్పటి నుంచి నాకు పరిచయమని తారక్ నాన్నగారు హరికృష్ణ నాతో యాక్ట్ చేశారని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయస్సులో బాల రామాయణం సినిమాలో నటిస్తున్న సమయంలో పిలిచానని ఇటు రారా నాన్నా అని పిలవగా వచ్చాడని పేరేంటి అని అడగగా ఒక చేతిపై మరో చేతిని కొడుతూ ఎన్టీ రామారావు అని చెప్పాడని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.

తాతగారి పేరు చెబుతున్నావేంటి అని అడగగా హరికృష్ణ వీడి పేరు కూడా అదే పెట్టామని చెప్పారని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా పేరు చెప్పేలా జూనియర్ ఎన్టీఆర్ కు ట్రైనింగ్ ఇచ్చారని అందుకే అలా చెప్పేవాడని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.

ఎన్టీ రామారావు అంటూ తనదైన మాడ్యులేషన్ తో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేవాడని చంద్ర మోహన్ కామెంట్లు చేశారు.

రాఖీ, బాద్ షా సినిమాలలో తారక్ తో కలిసి నటించానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

"""/" / మహేష్ బాబు చాలా రెస్పెక్ట్ ఇస్తారని చంద్రమోహన్ తెలిపారు.ప్రభాస్ రిజర్వ్డ్ గా ఉంటాడని ఆయన తెలిపారు.

రవితేజ, రామ్ లతో బోలెడు సినిమాలు చేశానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో మాత్రమే చేశానని చరణ్ తో కాంబినేషన్ సీన్లు లేవని చంద్రమోహన్ అన్నారు.

చంద్రమోహన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?