శోభన్ బాబు ఆస్తిపరుడైనా చంద్రమోహన్ దగ్గర అప్పు చేసేవారా.. అందుకే తీసుకున్నారంటూ?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో లక్కీ హీరో అనే గుర్తింపును సొంతం చేసుకోవాలంటే సులువు కాదు.
అయితే చంద్రమోహన్ ( Chandramohan )మాత్రం లక్కీ హీరోగా పేరు సంపాదించుకున్నారు.గతంలో ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ శోభన్ బాబు( Shobhan Babu ) చాలా ఆస్తిపరుడు అని ఆయన నాకు మంచి ఫ్రెండ్ అని అన్నారు.
శోభన్ బాబుకు ఆస్తులు ఉన్నా ఆయన నన్ను డబ్బులు అడిగేవారని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.
శోభన్ బాబు డబ్బులు అడగటంతో మొదట తాను ఆశ్చర్యపోయానని చంద్రమోహన్ కామెంట్లు చేశారు.
నేను అప్పుగా ఇచ్చే డబ్బుతో కలిసొచ్చిందని ఆయన నమ్మేవారని చంద్రమోహన్ తెలిపారు.ఆ కారణం వల్లే ఆస్తి కొన్న ప్రతిసారి నా దగ్గర డబ్బులు తీసుకునేవారని చంద్రమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
శోభన్ బాబు మరణం నా జీవితంలో తీరని లోటు చంద్రమోహన్ కామెంట్లు చేశారు.
"""/" /
55 సంవత్సరాల పాటు కళామతల్లి ముద్దుబిడ్డగా తన నటనతో చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
చంద్రమోహన్ బాపట్ల( Bapatla ) వ్యవసాయ శాఖలో డిగ్రీ పూర్తి చేశారు.చంద్రమోహన్, శోభన్ బాబు మంచి స్నేహితులు కూడా కావడం గమనార్హం.
ఒక సందర్భంలో చంద్రమోహన్ 100 కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నానని వెల్లడించారు. """/" /
నాకు పెద్దగా ఆస్తి లేదని ఒకానొక సమయంలో ఆస్తిని కోల్పోయానని చెప్పుకొచ్చారు.
కొన్న పొలాలను కాపాడుకోకుండా అమ్ముకోవడంతో ఆస్తిని పోగొట్టుకున్నానని చంద్రమోహన్ తెలిపారు.చంద్రమోహన్ గతంలో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చంద్రమోహన్ తో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉండేది.ఎంతోమంది హీరోయిన్లు ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేయడం గమనార్హం.
ఒకప్పుడు స్టార్ హీరోగా చంద్రమోహన్ ఒక వెలుగు వెలిగారు.చంద్రమోహన్ ఇండస్ట్రీలో నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు.
అప్పటి హీరోయిన్లు చంద్రమోహన్ కు జోడీగా నటించడానికి తెగ ఆసక్తి చూపించేవారని సమాచారం.
డైమండ్ రత్నబాబు ఈ సంవత్సరం భారీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా..?