ప్రభాకర్ కొడుకు ఫస్ట్ సినిమాకు నష్టాలెంత.. ఈ ప్రశ్నకు ఆయన జవాబు ఇదే!

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ( Prabhakar )తన కొడుకు చంద్రహాస్ నటించిన సినిమా రామ్ నగర్ బన్నీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

3 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలని భావించగా ఆ బడ్జెట్ 4 నుంచి 5 కోట్ల రూపాయలు అయిందని ఆయన చెప్పుకొచ్చారు.

నా కొడుకుతో అంత బడ్జెట్ తో సినిమా తీయొచ్చని అనిపించిందని ప్రభాకర్ వెల్లడించారు.

"""/" / నా కొడుకును మొదట పైలట్ చేయాలని అనుకున్నానని వాడు అవ్వలేదని మధ్యలోనే వచ్చేశాడని స్పోర్ట్స్ బాగా ఆడేవాడు కానీ ఏకాగ్రత ఉండేది కాదని ప్రభాకర్ తెలిపారు.

యాక్టింగ్ కు చంద్రహాస్ పర్ఫెక్ట్ అనిపించాడని ఆయన పేర్కొన్నారు.ఈ మధ్య కాలంలో సీరియల్స్ మాత్రమే లాస్ వస్తున్నాయని ప్రభాకర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం సీరియళ్లకు సంబంధించి ప్రొఫెషనలిజం తగ్గిందని ఆయన తెలిపారు. """/" / రామ్ నగర్ బన్నీ సినిమా( Ram Nagar Bunny )లో చంద్రహాస్( Chandraha ) నటనకు మంచి మార్కులు పడ్డాయని అయితే దేవర దెబ్బకు ఢమాల్ అని ప్రభాకర్ పేర్కొన్నారు.

మంగళవారం నుంచి మా సినిమాకు కలెక్షన్లు తగ్గాయని ఆయన తెలిపారు.దేవర సినిమా ఇప్పటికీ థియేటర్లలో అద్భుతంగా రన్ అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

స్టార్ ఉంటే ప్రేక్షకులు సినిమాలు చూస్తారని ప్రభాకర్ వెల్లడించారు.రామ్ నగర్ బన్నీ సినిమాను ఓటీటీలో చూస్తారని ఆయన తెలిపారు.

నా కొడుకు సినిమాకు టాక్ బాగా వచ్చింది కాబట్టి డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కుల ద్వారా ఆలస్యంగా డబ్బులు వచ్చినా నష్టాలు వచ్చే అవకాశం అయితే లేదని ప్రభాకర్ పేర్కొన్నారు.

శ్రీకాంత్ నా యాక్టింగ్ చూసి ప్రోత్సహించారని ఆయన తెలిపారు.మైసమ్మ ఐపీఎస్ సినిమా 100 రోజులు ఆడిందని ఆయన చెప్పుకొచ్చారు.

నేను ఇప్పటికీ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానని ప్రభాకర్ అన్నారు.ప్రభాకర్ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?