వచ్చే నెల 2న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే నెల 2వ తేదీన కడప జిల్లాకు వెళ్లనున్నారు.

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు.తరువాత అక్కడి నుంచి పులివెందులకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్నా టు వంశధార పేరుతో ఆగస్ట్ 1 వ తేదీ నుంచి చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించనున్నారని ఇప్పటికే ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆమెకేనా?