కుప్పంలో రెండు రోజులు… ఆసక్తికరంగా చంద్రబాబు టూర్ 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( AP CM Chandrababu Naidu )ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.

ఈ మేరకు నేడు, రేపు ఆయన కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో కుప్పం నియోజకవర్గంలో( Kuppam Constituency ) పరిస్థితిలను పూర్తిగా వైసిపికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.

చంద్రబాబు అక్కడ ఓటమి చెందేలా అనేక వ్యూహాలను అమలు చేసింది.టిడిపిలో కీలక నాయకులుగా ఉన్నవారు ఎంతో మందిని వైసీపీలో చేర్చుకుంది.

చంద్రబాబు ఓటమే ధ్యేయంగా అన్ని రకాల రాజకీయ ఎత్తుగడలను అమలు చేశారు. """/" / ముఖ్యంగా వైసీపీ కీలక నేత, అప్పటి మంత్రి , ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( MLA Peddireddy Ramachandra Reddy ) కుప్పం నియోజకవర్గం పై ఫోకస్ చేసి చంద్రబాబు కు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగురవేయాలని ప్రయత్నించారు.

కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతోనే చంద్రబాబు అక్కడ నుంచి విజయం సాధించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన కుప్పంలో పర్యటించేందుకు వెళ్తున్నారు.  ఈరోజు,  రేపు ఆయన కుప్పం నియోజకవర్గంలోనే ఉండబోతున్నారు.

  దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు .

"""/" / ఇక ఈ రోజు ఈ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.

అలాగే హంద్రీనీవా కాలువను ఆయన పరిశీలించనున్నారు.ఇక ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.

రేపు కుప్పం నియోజకవర్గంలో ప్రజల నుంచి వినతులను  స్వీకరిస్తారు.చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ నుంచి భారీగా టిడిపిలో చేరికలు ఉండేలా ప్లాన్ చేశారు.

గతంలో వైసీపీ నేతలకు భయపడి టిడిపి నుంచి వైసీపీలో చేరిన వారు, గతంలో వైసీపీలో కీలకంగా నియోజకవర్గంలో పనిచేసిన వారిని టిడిపిలో చేర్చుకుని ఇకపై కుప్పంలో వైసీపీ ప్రభావం ఏమాత్రం లేకుండా చేసే ప్లాన్ లో టిడిపి ఉన్నట్టుగా అర్థం అవుతుంది.

పండ్ల తొక్కలతో మరింత అందంగా మెరిసిపోండిలా..!