అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంపై దర్యాప్తు చేయాలి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
ఈరోజు ఉదయం విశాఖ జిల్లా అచ్యుతాపురం సాహితీ ఫార్మా కంపెనీ( Atchutapuram SEZ Pharma Company )లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.పలువురు గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది.దీంతో గాయపడినవారిని కేజీహెచ్ కు తరలించడం జరిగింది.
కాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( TDP Leader Chandrababu Naidu ) స్పందించారు.
సాహితీ ఫార్మా అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందటం బాధాకరమని అన్నారు.ఇదే సమయంలో ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలి.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
ఇటువంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలి అని చంద్రబాబు సూచించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ ఘటనలో మృతులకు 25 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది.
ఇదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు.మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది చాలా కష్టపడటం జరిగింది.
పోలీసుల సైతం ఘటన స్థలంలో సహాయ సహకారాలు అందించారు.
ఆ రైతుబిడ్డ పెద్ద వెధవ.. నా అన్వేషణ అన్వేష్ షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్!