జనవరిలో చంద్రబాబు షెడ్యూల్ ఖరారు..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

ఈ మేరకు వచ్చే నెలలో చంద్రబాబు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో చంద్రబాబు షెడ్యూల్ ను టీడీపీ ఖరారు చేస్తోంది.జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ బహిరంగ సభలు మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రోజుకు రెండు బహిరంగ సభలు నిర్వహించే విధంగా టీడీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుందని తెలుస్తోంది.

ఈనెలాఖరులోగా 25 బహిరంగ సభలను పూర్తి చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.ఈ 25 సభలే కాకుండా ఎన్నికల్లోగా మరో రెండు భారీ బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేస్తుందని సమాచారం.

ఆ రెండు సభలకు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యే విధంగా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players