కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నిక వ్యవహారంపై చంద్రబాబు స్పందన
TeluguStop.com
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జగన్ కు చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యనించారు.
బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ తెచ్చిందని, ఇది చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని స్పష్టం చేశారు.
న్యాయంగా జరిగిన ఎన్నికలను ఒప్పుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు.అయితే, అర్బన్ బ్యాంకు ఎన్నికల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడాన్ని భరించలేక వైసీపీ నేతలు ఎన్నికలను రద్దు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అదేవిధంగా పాలక వర్గానికి బదులు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!