ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగింపు అయింది.
ఈ మేరకు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగించింది.
చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఈనెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించారు.అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపటిలో ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.