చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో ప్రస్తావన
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రానుంది.ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందు క్వాష్ పిటిషన్ అంశాన్ని ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని సిద్దార్థ్ లూథ్రా కోరనున్నారు.
అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
రాష్ట్ర హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన అరెస్ట్ చెల్లదంటూ ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అదేవిధంగా ఈ క్వాష్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రతివాదిగా చేర్చారు.
ఈ పిటిషన్ పై సుప్రీం విచారణ చేసే అవకాశం ఉంది.