కుప్పం అభ్యర్థిగా రేపు చంద్రబాబు నామినేషన్

చిత్తూరు జిల్లా కుప్పం( Kuppam ) నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ మేరకు రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి భువనేశ్వరి( Bhuvaneshwari ) దాఖలు చేయనున్నారు.

అయితే తొలిసారి చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ముందుగా రేపు ఉదయం కుప్పం వరదరాజుల స్వామి వారి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

తరువాత నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్న ఆమె కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience