AP CM Jagan : కేసులు వేయించడం చంద్రబాబుకు సహజ అలవాటు..: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలోని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించిందా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు( Chandrababu ) పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు.

మంచి కోసం తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు పేదలకు ఇంటి స్థలం ఇస్తుంటే అడ్డుకుంటూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.

"""/" / ఈ క్రమంలోనే ఇంటి స్థలాలను అడ్డుకుంటూ సుమారు 1,191 కేసులు వేశారని చెప్పారు.

ఇప్పుడు ఇంటి స్థలాలు ఇస్తుంటే ఇప్పుడు కూడా హైకోర్టులో కేసులు( High Court ) వేశారని తెలిపారు.

చంద్రబాబు ఏనాడూ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వలేదన్న సీఎం జగన్ ఇప్పుడు తాము ఇస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

కేసులు వేయించడం చంద్రబాబుకు సహజ అలవాటని విమర్శించారు.వందమంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువన్నారు.

గతంలో అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే.సామాజిక అసమతుల్యం వస్తుందని స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు.

కల్కి చూసి కాలర్ ఎగరేసుకునేలా గర్వపడతారు.. నాగ్ అశ్విన్ అంచనాలు పెంచారుగా!