కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు తరలింపు..!!
TeluguStop.com
విజయవాడలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబును తరలించనున్నారు.ఈ మేరకు సిట్ కార్యాలయంలో ఆయనను సీఐడీ అధికారులు మరోసారి విచారించనున్నారని తెలుస్తోంది.
అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నారు.వైద్య పరీక్షల తరువాత చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు సీఐడీ అధికారులు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ ఉదయం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే రోడ్డు మార్గం ద్వారా ఆయనను అమరావతికి తరలిస్తున్నారు.మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై బైటాయించి నిరసనలు చేస్తున్నారు.
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్