చంద్రబాబు భారీ స్కెచ్.. తగ్గేదేలే !

స్కిల్ స్కామ్( Skill Development Scam ) లో భాగంగా గత కొన్నాళ్లు జైల్ రిమాండ్ ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇటీవల రెగ్యులర్ బెయిల్ మంజూర్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అసలు ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనే సందేహాల మద్యనే 52 రోజులు జైల్లో గడిపిన బాబుకు ఎట్టకేలకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పిల్చుకున్నారు.

మొదట తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు కావడం చంద్రబాబుకు ఊరటనిచ్చే అంశం.

"""/" / ఇకపై ఆయన ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.జైలుకు వెళ్ళడం కంటే ముందు వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో గడిపిన చంద్రబాబు అండ్ కొ.

స్కిల్ స్కామ్ బయటపడిన తరువాత ఒక్కసారిగా టీడీపీ కార్యక్రమాలన్నీ హోల్డ్ లో పడ్డాయి.

ఇక మళ్ళీ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభించే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు( Chandrababu Naidu )ఆయన ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాప్పటికి ఎలాగైనా ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.

ఎందుకంటే వచ్చే ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. """/" / ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.

అందుకే ప్రస్తుతం ఆయన విషయంలో వైఎస్ జగన్( YS Jagan Mohan Reddy ) వ్యవహరిస్తున్న కక్షపురిత వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసులేక్కెందుకు అస్త్ర శాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారట.

ఈ అంశాలన్నిటితో జగన్ ను ఇరుకున పెట్టె విధంగా ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు.

ప్రదానంగా తనపై మోపిన అక్రమ కేసులను పదే పదే ప్రస్తావిస్తూ జగన్ ను ఇరకాటంలో పెడితే వైసీపీ డిఫెన్స్ లో పడుతుందనే భావనతో ఉన్నారట.

అంతే కాకుండా ఇకపై తను చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన పాలు పొందేలా వ్యూహాలు రచిస్తున్నారట.

మరి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు తన ప్రణాళికలతో జగన్ ను ఎంతమేర ఇరుకున పెడతారో చూడాలి.

మొటిమలు వాటి తాలూకు గుర్తులతో ఇక నో వర్రీ.. ఇంట్లోనే ఈజీగా వదిలించుకోండిలా!