టికెట్ల విషయంలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్..: బుద్దా వెంకన్న
TeluguStop.com
టీడీపీ నేత కేశినేని నాని వ్యాఖ్యలపై మరో నేత బుద్దా వెంకన్న స్పందించారు.
కేశినేని నానితో వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు.రెండు రోజులుగా కేశినేని ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలన్నారు.
టికెట్ల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.ఒకవేళ చంద్రబాబు కేశినేని నానికి టికెట్ ఇచ్చినా తను పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా పార్టీలో ప్రక్షాళన జరగాలన్న కేశినేని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
హిట్3 సినిమాతో నాని ఆ రికార్డును క్రియేట్ చేస్తారా.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?