చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరికాసేపటిలో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో మరికాసేపటిలో విచారణ జరగనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై విచారణ నేపథ్యంలో చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కస్టడీ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపనుంది.మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కోర్టుకు చేరుకున్నారు.

సీఐడీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనున్న సిద్దార్థ్ లూథ్రా న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

ఒకవేళ ఏసీబీ కోర్టులో బెయిల్ దొరకకపోతే సిద్దార్థ లూథ్రా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

షాకింగ్ వీడియో.. డ్రైవర్‌ పొరపాటుతో మొదటి అంతస్తు నుంచి కిందపడిన కారు