చంద్రబాబు పిలుపు ... రేవంత్ కు ఇబ్బందులు !
TeluguStop.com
తెలంగాణలో తెలుగు తమ్ముళ్లందరినీ యాక్టివ్ చేసి , మళ్లీ కీ రోల్ పోషించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టేసారు.
ఇప్పటికే ఖమ్మం బహిరంగ సభ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు తెలంగాణ టిడిపి తరఫున చేపట్టి ప్రధాన పార్టీలకు సవాల్ విసిరే స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిపోవడంతో, తెలంగాణ సెంటిమెంట్ ఇక పని చేయదని , కెసిఆర్ అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి ప్రాధాన్యం దక్కాలని కోరుకుంటారు కాబట్టి, తెలంగాణ సెంటిమెంటును ఇక ఉపయోగించరని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.
దీనిలో భాగంగానే తెలంగాణ టిడిపి నుంచి ఇతర పార్టీలో చేరిన నాయకులంతా మళ్ళీ వెనక్కి రావాలని బాబు పిలుపునిచ్చారు.
అయితే ఈ పిలుపును అందుకుని ఎంతమంది చేరుతారు అనేది పక్కన పెడితే , బాబు పిలుపు కారణంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రం ఈ పిలుపు ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
టిడిపిలో రేవంత్ యాక్టివ్ గా ఉండేవారు .చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగాను ఆయన వ్యవహరించారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్ర కూడా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఆ తర్వాత తెలంగాణలో టిడిపి ఉనికి కోల్పోవడం, ఏపీ రాజకీయాలపై చంద్రబాబు దృష్టి సారించడంతో, తెలంగాణ రాజకీయాలను పక్కన పెట్టేశారు .
దీంతో ఆ పార్టీలో కీలక నాయకులు కార్యకర్తలు చాలామంది ఇతర పార్టీలో చేరిపోయారు.
"""/"/
ఆ విధంగానే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరారు.ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఎంతోమంది టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.అయితే ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని టిడిపి వ్యక్తిగానే చూస్తూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.
ఇటీవల రేవంత్ వర్గానికి తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కక పోవడం తో సీనియర్లు అసంతృప్తికి గురవడం వంటివి చోటుచేసుకున్నాయ .
ఈ వ్యవహారాలతో రేవంత్ వర్గం కూడా అవేమయంలో ఉంది.ఈ క్రమంలో చంద్రబాబు పిలుపు మేరకు రేవంత్ వర్గానికి చెందిన మాజీ టిడిపి నేతలు కాంగ్రెస్ ను వీడి మళ్లీ టిడిపి లో చేరితే రేవంత్ రెడ్డి మరింత బలహీనం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇదే ప్రస్తుతం రేవంత్ ని కూడా ఆందోళనకు గురి చేస్తోందట.
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?