తొలి విడత టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు వరాలు..!!

రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో తొలి విడుత టీడీపీ మేనిఫెస్టోనీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడం జరిగింది.

ఈ మేనిఫెస్టోలో మహిళలకు వరాలు జల్లు కురిపించారు."భవిష్యత్తు గ్యారెంటీ" పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో( TDP Manifesto ) ప్రకటించడం జరిగింది.

ఈ మేనిఫెస్టోలో మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత కార్యక్రమం, ఇంటింటికి తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పుర్ టు రిచ్ అనే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో "ఆడబిడ్డ నిధి"ని.ఏర్పాటుచేసి 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు నెలకు ₹1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.

"""/" / ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు( Chandrababu Naidu ) పేర్కొన్నారు.

అంతేకాదు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

అని పేర్కొన్నారు.అంతేకాదు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు మహిళలకు అవకాశం కూడా పార్టీ కల్పిస్తుందని పేర్కొన్నారు.

20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు.ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ₹3000 రూపాయలు.

నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.జగన్( YS Jagan Mohan Reddy ) పని అయిపోయింది జీవితంలో మళ్లీ ఎప్పుడు గెలవడు.

వచ్చే ఎన్నికలలో టీడీపీ కార్యకర్తలు బాగా కష్టపడాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

హీరో అజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన భార్య షాలిని.. అసలేం జరిగిందంటే?