చంద్రబాబు అరెస్ట్ : ఆ ఒక్కడి స్టేట్మెంట్ కొంప ముంచింది !

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu Arest )అయ్యారు.

ఈ వ్యవహారంపై రాజకీయ రచ్చ జరుగుతుంది .అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని , కక్ష సాధింపు ధోరణితో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని,  రాజకీయంగా అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సానుభూతి వ్యక్తం చేశాయి.

చంద్రబాబు ( Chandrababu )అరెస్టుకు కారణమైన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించి సిఐడి అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.

"""/" / ముఖ్యంగా ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ ( Ramesh PV )కీలకంగా మారారు .

ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన కుట్రన సిఐడి అధికారులు చేదించగలిగారు.

అసలు ఈ స్కాం ఎప్పుడు ఎలా జరిగిందనేది పివి రమేష్ , సిఐడి అధికారులకు వివరించడంతో పక్క ఆధారాలను సేకరించి చంద్రబాబును అరెస్టు చేశారు.

ఏపీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ నిధుల విడుదల చేసేందుకు నిరాకరించారు.

అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని వారించారు.ఈ మేరకు సీఎస్ కు కూడా లేఖ రాశారు.

నిధులు రిలీజ్ చేయద్దు అని సూచించారు.ఇదే విషయాన్ని సిఐడి విచారణలో స్టేట్మెంట్ గా ఇచ్చారు పీవీ రమేష్.

ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది సిఐడి.బాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్లు సిఐడి కి వాంగ్మూలం ఇచ్చారు పివి రమేష్.

"""/" /  ఈ స్కాం లో ప్రధాన లబ్ధిదారు చంద్రబాబు అని సిఐడి ఆరోపిస్తోంది .

ఈ కేసులో చంద్రబాబును ఏ 37 నుంచి ఏ 1 గా మార్పు చేసింది.

ఇక పీవీ రమేష్ వైసీపీ ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేశారు.  పూణేలో స్కాం లింకులు బయటపడిన తర్వాత రమేష్( Ramesh PV ) ను సిఐడి విచారించింది .

సీమెన్స్ ప్రతినిధులను కూడా పిలిచి విచారించారు సిఐడి అధికారులు.  పీవీ రమేష్ అప్రూవల్ గా మారడంతో ఈ కేసు అనే కీలక మలుపులు తిరిగింది.

డొల్ల కంపెనీల లింకులు ఆధారాలు సిఐడి అధికారులు సేకరించారు.పక్కగా అన్ని ఆధారాలను దగ్గర పెట్టుకుని చంద్రబాబును అరెస్టు చేశారు.

బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టును పెంచుతుంది.. ఎలాగంటే?