చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం..: మోత్కుపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదన్న ఆయన గవర్నర్ అనుమతి లేకుండా రాజ్యాంగానికి విరుద్దంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

ఏడు, ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన చంద్రబాబు రూ.300 కోట్ల కోసం అవినీతికి పాల్పడతారా అని మోత్కుపల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు ఎప్పుడూ కక్ష సాధింపులకు పాల్పడలేదని చెప్పారు.ఈ క్రమంలో ఇప్పటికైనా సీఎం జగన్ తన తప్పును సరిదిద్దుకోవాలని తెలిపారు.

అదేవిధంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు అరెస్టును సీఎం కేసీఆర్ ఖండించాలని తెలిపారు.

ప్రభాస్ సినిమాల్లో ఆయనకే నచ్చని సినిమా ఏంటో తెలుసా..? అసలు అది చేయకపోతే బాగుండేదేమో..?